ఫుట్‌పాత్‌లు ఏవీ..? | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌లు ఏవీ..?

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

పట్టణాల్లో యథేచ్ఛగా

రహదారుల ఆక్రమణలు

చర్యలు తీసుకుంటాం..

అద్దెకు ఇచ్చి సొమ్ము..

అచ్చంపేట: జిల్లాలోని నాలుగు మున్సిపల్‌ పట్టణాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. వాహనాల రద్దీ సైతం పెరిగింది. అయితే వాహనాలు నిలిపేందుకు స్థలం, పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లపైనే వాహనాలు నిలుపాల్సి వస్తోంది. ఫుట్‌పాత్‌లు లేక రోడ్ల మీదే నడవాల్సిన పరిస్థితి ప్రజలకు దాపురించింది. మున్సిపాటిల్లో అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టినా, సెట్‌బ్యాక్‌ లేకున్నా సంబంధిత అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. ఫిర్యాదుల వస్తే తప్ప కార్యాలయం నుంచి బయటకు కదలడం లేదనే విమర్శలు ఉన్నాయి.

అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా..

జిల్లాలోని మున్సిపాలిటీల్లో వ్యాపారాలు పెరిగాయి. దీంతో ఎలాంటి సదుపాయాలు లేకుండా వ్యాపార దుకాణాలను నిర్మించుకుని యజమానులు అద్దెకు ఇచ్చుకుంటున్నారు. చాలా భవనాలు సెట్‌బ్యాక్‌ లేకుండా రోడ్లు, డ్రైయినేజీలపై కప్పులు వేసి నిర్మించారు. అయితే మున్సిపాలిటీల అనుమతులు ఒకలాగా ప్లానింగ్‌ తీసుకుని, నిర్మాణాలు మాత్రం మరోలా చేపట్టారు. పాదచారులు నడవాల్సిన ఫుట్‌పాత్‌లు సైతం అక్రమణలకు గురవుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

షట్టర్ల ముందు షెడ్లు..

అచ్చంపేట పట్టణంలోని రోడ్ల వెంట షెట్టర్లను అద్దెకు తీసుకున్న వారు వాటిని అనుసరించి.. మరో షట్టర్‌ అంతా రేకుల షెడ్డు వేసి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్య తలెత్తుతోంది. వాణిజ్య సమూదాయాలు అధికంగా ఉన్న నాగర్‌కర్నూల్‌ రోడ్డులోని ఎస్‌బీఐ ఏరియా, ఆర్టీసీ బస్టాండ్‌, రాజీవ్‌ చౌరస్తా, అంబేడ్కర్‌ చౌరస్తా, ప్రభుత్వ ఆస్పత్రి, నెహ్రూ చౌరస్తా, మల్లంకుంట, సాయిరాం థియేటర్‌, ఉప్పునుంతల రోడ్డు, లింగాల రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్‌, ఫుట్‌పాత్‌ సమస్య అధికంగా ఉంది. షాపింగ్‌మాల్స్‌, దుకాణదారులు పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు నిలిపేందుకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాల నిర్వహణ

ఇబ్బందుల్లో పాదచారులు

వాహనాల పార్కింగ్‌కు సైతం తిప్పలే

ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య తీర్చేందుకు అనుమతి లేని సెల్లార్ల యాజమానులతో పాటు రోడ్ల అక్రమణదారులకు నోటీసులను జారీ చేస్తాం. వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్ద పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తాం. పోలీస్‌శాఖ సమన్వయంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. వాహనదారులు సైతం ప్రధాన రోడ్లు, చౌరస్తాల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపకూడదు.

– డి.మురళి మున్సిపల్‌ కమిషనర్‌

కొందరు దుకాణదారులు తమ వ్యాపారాలను ఫుట్‌పాత్‌లపై నిర్వహించడమే కాకుండా.. దుకాణం ఎదుట ఉన్న ప్రాంతాన్ని సైతం చిరువ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారు. వారి నుంచి రోజువారీగా అద్దెను వసూలు చేస్తూ.. ప్రతినెలా రూ.వేలల్లో సొమ్ము చేసుకుంటున్నారు. చిరువ్యాపారులు రోడ్లు, ఫుట్‌పాత్‌లపైనే వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురువుతున్నారు. గతంలో ఫుట్‌పాత్‌లను అక్రమించి వ్యాపారాలు చేసిన వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు సైతం నిర్వహించారు. కాలక్రామేణ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో పట్టణాల్లో ప్రధాన రహదారుల వెంట ఈ దందా యథేచ్ఛగా సాగుతుండగా.. ప్రశ్ని ంచే అధికారే కనిపించకపోవడం విడ్డూరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement