స్పీకర్‌కు సంఘీభావం తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

స్పీకర్‌కు సంఘీభావం తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

కల్వకుర్తి రూరల్‌: రాష్ట్ర శాసనసభలో బుధవారం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌నుద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని.. సభా మర్యాద, గౌరవ సంప్రదాయాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉందని వారన్నారు.

విద్యార్థి దశ కీలకం

కందనూలు: ఉజ్వల భవిష్యత్‌ నిర్మాణానికి విద్యార్థి దశ అత్యంత కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసగా మారితే భవిష్యత్‌ నాశనం కావడంతో పాటు కుటుంబం సైతం నిర్వీర్యమవుతుందని తెలిపారు. అలాగే సైబర్‌ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వి ద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ మదన్మోహన్‌, సైబర్‌ క్రైం ఎ స్‌ఐ గిరిమోహన్‌, శ్రీరామ్‌ ఆర్య పాల్గొన్నారు.

సద్వినియోగం

చేసుకోవాలి

కందనూలు: న్యాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న నిర్వహించే జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డా.సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నమోదైన డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ (ఈఈ) కేసులు, పెట్టి, ట్రాఫిక్‌ చలానాలు, మైనర్‌ క్రిమినల్‌ కేసులు, సివిల్‌ వివాదాలను రాజీ మార్గం ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు.

12న జిల్లాస్థాయి

అథ్లెట్ల ఎంపికలు

కల్వకుర్తి రూరల్‌: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 12న జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి స్వాములు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో నిర్వహించే 12వ తెలంగాణ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ నిమిత్తం అండర్‌–14, 16, 18, 20 విభాగాల్లో ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, ఖేలో ఇండియా యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత కలిగిన అండర్‌–18 క్రీడాకారులను ఎంపికచేసే ప్రక్రియలో భాగంగా ఈ సెలక్షన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98664 69054 నంబర్‌కు సంప్రదించాలని ఆయన తెలిపారు.

ఎన్‌ఎస్‌యూఐకు

కొత్త సారథులు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఽఅధ్యక్షుడిగా ఎ.శేఖర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడిగా నల్లవెల్లి యశ్వంత్‌, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీకాంత్‌, గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అవినాష్‌ యాదవ్‌, నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఎండీ అఫ్రోజ్‌ను నియమించారు. ఎన్‌ఎస్‌యూఐను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడుసూచించారు.

ఐదు జిల్లాలకు అధ్యక్షుల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement