నేటి యువతకు ఆదర్శం.. | - | Sakshi
Sakshi News home page

నేటి యువతకు ఆదర్శం..

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

నేటి యువతకు ఆదర్శం..

కాళోజీ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ భాషా సంస్కృతులు, ప్రజా చైతన్యానికి కాళోజీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అన్యాయాలపై తన కలం ద్వారా ప్రజలను చైతన్యపరిచిన యోధుడని పేర్కొన్నారు. నేటి తరం యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు కాళోజీ జీవితాన్ని, ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏవో కృష్ణయ్య, ఆర్‌ఐ జగన్‌, ఎస్‌ఐలు రమేశ్‌, రాంలాల్‌, ఆర్‌ఎస్‌ఐ ప్రశాంత్‌, గౌస్‌ పాషా, శివాజీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement