వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడకుంటూ మంగళవారం వెల్దండ మండల కేంద్రంలో
గ్రామస్తులు శివుడి గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భజనలు చేస్తూ ముందుకు సాగారు. గ్రామ దేవతలకు, శివుడికి అభిషేకాలు చేశారు. అనంతరం వరదపాశం పోశారు. యాదవ కులస్తులతో వరదపాశం తినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, వెంటయ్యగౌడు, ఉపసర్పంచ్ శ్రీనువాసులు, నాయకులు చిందం కృష్ణయ్య,
వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు. – వెల్దండ


