వానాకాలం పంటలకు మద్దతు ధరలు | - | Sakshi
Sakshi News home page

వానాకాలం పంటలకు మద్దతు ధరలు

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

కందనూలు: 2026–27 వానాకాలం పంటలకు కనీస మద్ధతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి నరేంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరి సాధారణ రకం రూ. 2,441, గ్రేడ్‌–ఏ రూ. 2,461, జొన్న హైబ్రిడ్‌ రూ. 4,023, జొన్న మాల్‌దండి రూ. 4,073, సజ్జ రూ. 2,900, రాగి రూ. 5,205, మొక్కజొన్న రూ. 2,410, కందులు రూ. 8,450, పెసలు రూ. 8,750, మినుములు రూ. 8,200, వేరుశనగ రూ. 7,517, పొద్దుతిరుగుడు విత్తనం రూ. 8,343, సోయాబిన్‌ రూ. 5,708, నువ్వులు రూ. 10,346, నైజర్‌సీడ్‌ రూ. 10,052, పత్తి రూ. 8,267 ధరలను ప్రకటించినట్లు పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధరలను తెలుసుకొని తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement