ఫలితాలు మెరుగుపడేనా?
సమీపిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షలు
● ఇతర బాధ్యతల నిర్వహణలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు
● విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం
● ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
కొనసాగుతున్న
ప్రత్యేక తరగతులు..
జిల్లాలో 131 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. దాదాపు 5,500 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మెరుగైన ఫలితాల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఇతర ప్రభుత్వ పనుల్లో నిమగ్నమై ఉండటంతో విద్యార్థుల చదువుపై అనుకున్నంత స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నామని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు. త్వరలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు సైతం ఉపాధ్యాయులకు అప్పగించే అవకాశం ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కుమ్మెర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులు వింటున్న
పదో తరగతి విద్యార్థులు
కందనూలు: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమం తప్పకుండా విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నా.. గత నెలలో పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు ఉండటం, ప్రస్తుతం పాఠశాలల తనిఖీలకు వెళ్తుండటంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎలాగైనా ఈ సారి జిల్లాలో మొదటి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో ఉన్న విద్యార్థుల కలలు కల్లలుగానే మిగిలే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇతర బాధ్యతలు అప్పగిస్తుండటంతో విద్యార్థులు చదువులో వెనకబడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతున్నా ఏ మేరకు ఫలితాలు ఉంటాయనే సందిగ్ధం నెలకొంది.
ఒక్కరు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓ..
జిల్లాలోని కల్వకుర్తి మండలంలో మాత్రమే రెగ్యులర్ ఎంఈఓ కొనసాగుతున్నారు. మిగతా మండలాల్లో ఇన్‌చార్జి ఎంఈఓలతోనే నెట్టుకొస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి హెచ్‌ఎంలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఇన్‌చార్జి ఎంఈఓలు పాఠశాలల్లో బోధన కంటే.. ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల విధులు, సర్వేలు, పాఠశాలల తనిఖీలు వంటివి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో వివిధ సబ్జెక్టుల టీచర్లను సర్దుబాటు చేసినా ఆశించిన ఫలితం కనిపించ లేదు. ఉపాధ్యాయులకు వివిధ రకాల పనులతో బోధనపై సరైన దృష్టి పెట్టలేకపోతున్నారు. గతేడాది సైతం చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఏ మేరకు రాణించగలుగుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
మార్చి 14 నుంచి పరీక్షలు..
పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జనవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు.
సంవత్సరం ఉత్తీర్ణత శాతం ర్యాంకు
2021–22 90.55 16
2022–23 89.68 12
2023–24 90.20 23
2024–25 95.83 13
ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు
జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణతో పాటు ఒక సంఖ్యకు చేరుకుంటాం. – రమేష్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి
ఫలితాలు మెరుగుపడేనా?


