భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి
ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేటలో ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు జరిగే శ్రీపబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అన్నిశాఖల అధికారులతో సమన్వయంగా భక్తులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నారెడ్డి సత్యనారాయణరెడ్డి, ఈఓ సత్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


