బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్
నాగర్‌కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని నూతన ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జి పాటిల్ అన్నారు. శనివారం ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వెంకటేశ్వర్లు నూతన ఎస్పీకి పూలబొ కే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలన్నారు. అంతకు ముందు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నూతన ఎస్పీకి బాధ్యతలు అప్పగించి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బదిలీపై వెళ్లారు.
‘పంచాయతీ’
రిజర్వేషన్లపై కసరత్తు
నాగర్‌కర్నూల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ శనివారం కలెక్టరేట్‌లో పూర్తిచేయనున్నారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగనుండగా ఆదివారం రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో ఖరారయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు, జిల్లా పరిధిలోని నలుగురు ఆర్డీఓల సమక్షంలో రిజర్వేషన్లు ఎంపిక చేశారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ప్రకారం లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ శుక్రవారం పూర్తికాగా.. మహిళల రిజర్వేషన్ స్థానాలు ఎంపిక చేయనున్నారు. ఈ రిజర్వేషన్ల జాబితాను ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు పంపిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా, బీసీలకు 2024 కుల గణన సర్వే నివేదిక ప్రామాణికంగా తీసుకున్నారు. 2019 నాటి రిజర్వేషన్ స్థానాలను మార్చాల్సి ఉన్నందున్న రొటేషన్ పద్ధతిన ఈ జాబితాను పరిశీలిస్తూ తాజాగా రిజర్వేషన్లను కేటాయించనున్నారు. వీటిని సెప్టెంబర్‌లో ఖరారు చేసిన రిజర్వుడ్ స్థానాలతో పోల్చనున్నారు. ఇందులో బీసీ కేటగిరి స్థానాలను 42 శాతం నుంచి 22.3 శాతానికి తగ్గించి మిగిలిన 19.7 శాతం సీట్లను జనరల్ కేటగిరికి కేటాయించనున్నారు.
డిజిటల్ లెర్నింగ్‌లో
రాష్ట్రంలో 3వ స్థానం
తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్‌లో రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచారు. దీంతో విద్యాలయం ప్రత్యేకాధికారి సుజాతకు మరింత శిక్షణ ఇచ్చేందుకు ఖాన్ అకాడమీ ఢిల్లీలో జరిగే సెమినార్‌కు ఆహ్వానించింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కరికులంలో భాగంగా ఖాన్ అకాడమీ స్టెమ్ (డిజిటల్ లెర్నింగ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. గత ఆరు నెలల నుంచి పాఠశాల వారిగా ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. డిజిటల్ లెర్నింగ్‌లో తిమ్మాజిపేట కేజీబీవీ రాష్ట్రస్థాయిలో టాప్–3లో ఉండడంతో ఖాన్ అకాడమీ ఎడ్యుకేషన్ సమ్మిట్ వారు ప్రత్యేకాధికారి సుజాతను శనివారం ఢిల్లీలో జరిగే సెమినార్‌కు రావాలని ఆహ్వానం పంపడంతో ఆమె వెళ్లారు.
పర్యావరణంపై
అవగాహన అవసరం
కందనూలు: విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన అవసరమని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఏకో బజార్ పర్యావరణం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులలో పర్యావరణ అంశాల మీద అవగాహన కల్పించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ స్టాండ్ కై ్లమెట్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర జాతీయ హరితదళం, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిరుపయోగ వస్తువుల నుంచి.. ఉపయోగపడే పర్యావరణహితమైన వస్తువులపై అవగాహన కల్పించడం కోసం విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి శారద ఉన్నత పాఠశాలకు లభించింది. కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ నాగేందర్, రాజశేఖర్‌రావు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్
బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్


