పంచాయతీకి సన్నద్ధం
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
ఆ గ్రామాల భవితవ్యం ఏంటో..
ప్రభుత్వానికి నివేదించాం..
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ఇటీవల ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ స్థానంలో మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే కొత్త రిజర్వేషన్ల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. మొత్తం 50 శాతం మేరకు రిజర్వేషన్లను వర్తింపజేయనుండగా.. ఎస్టీ, ఎస్సీలకు కేటాయించగా మిగిలిన స్థానాలను బీసీలకు కేటాయిస్తారు. మిగతా 50 శాతం స్థానాల్లో జనరల్ ఉంటాయి. గ్రామ సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను ఆర్డీఓ, వార్డు స్థానాలను ఎంపీడీఓలు ఖరారు చేయనున్నారు.
సాక్షి, నాగర్‌కర్నూల్: గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మొత్తం 50 శాతం రిజర్వేషన్ల పరిధి మేరకే ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను శనివారం పూర్తిచేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు అందగా అధికారులు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. శనివారం సాయంత్రానికే గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండగా.. వారం రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాలు ఊపందుకున్నాయి.
నివేదిక ఆధారంగా..
గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డుసభ్యుల రిజర్వేషన్ స్థానాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ఆధారంగా రిజరేషన్లను కేటాయించి, బీసీ వర్గాలకు ప్రభుత్వం 2024లో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (ఎస్‌ఈఈఈపీసీ) ప్రకారం బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ పద్ధతిలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా చూస్తారు. ముందుగా ఎస్టీ స్థానాలకు, తర్వాత ఎస్సీ స్థానాలకు, చివరగా బీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 2019 మొదటి సాధారణ ఎన్నికల్లో గ్రామాలు, వార్డు స్థానాలకు ఉన్న రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో మార్పులు చేస్తుండటంతో గ్రామాల రిజర్వేషన్లు మారనున్నాయి. ఈ పద్ధతిలో ఎస్టీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల జాబితా నుంచి గతంలో కేటాయించిన గ్రామాల తర్వాత వరుస క్రమంలో ఉన్న వాటిని రిజర్వేషన్ల కోసం ఎంపిక చేస్తారు. ఇదేవిధంగా ఎస్సీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ల స్థానాలను గుర్తిస్తారు. ఏజెన్సీ ఏరియాల్లోని ఎస్టీ స్థానాలను మినహాయించి మిగతా స్థానాల్లోనూ ఎస్టీ కోటా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించనున్నారు.
ప్రమాదారిలో..
జిల్లాలో మారుమూల ప్రాంతమైన చారకొండ మండలంలోని గోకారం గ్రామానికి వెళ్లే రహదారి ఇది. జడ్చర్ల – కోదాడ ప్రధాన రహదారికి 3 కి.మీ., దూరంలో ఈ రోడ్డు ఇప్పటి వరకు బీటీకి నోచుకోకపోవడంతో.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి దారి ఇలా అడుగు మేర కోతలకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. గతంలో ఎన్నోసార్లు బీటీ మంజూరు చేయాలని గ్రామస్తులు అధికారులు, పాలకులను వేడుకున్నా పట్టించుకోకపోవడంతోమాకిదేమి గ్రహచారంఅంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. – చారకొండ
50 శాతం పరిధి మేరకు
రిజర్వేషన్లపై కసరత్తు
నేటి సాయంత్రంలోగా
పూర్తికానున్న ప్రక్రియ
రొటేషన్ పద్ధతిలో
మారనున్న పలు గ్రామాలు
వారం రోజుల వ్యవధిలోనే
నోటిఫికేషన్ విడుదల?
జిల్లాలోని అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, వంగూరోనిపల్లి, ప్రశాంత్‌నగర్‌కాలనీ, లక్ష్మాపురం గ్రామాలు గత ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. అయితే ఈ గ్రామాల్లో ఎవరూ ఎస్టీలే లేకపోవడంతో సర్పంచ్‌లుగా ఎవరూ పోటీ చేయలేకపోయారు. ఈ ఐదు గ్రామాలకు సర్పంచ్‌లు లేకుండానే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. ఎస్టీ జనాభా లేని గ్రామాల్లో ఇతరులకు రిజర్వేషన్లు కేటాయిస్తారా.. లేదా.. ఈసారి కూడా సర్పంచ్‌లు లేకుండా ఉండిపోతాయా అన్నది సందిగ్ధంగా మారింది.
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రొటేషన్ పద్ధతిలో పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు స్థానాల రిజర్వేషన్లు మారుతాయి. అమ్రాబాద్ మండలంలోని గ్రామాలు ఏజెన్సీ ఏరియా కావడంతో మా పరిధిలో లేదు. దీనిపై ప్రభుత్వానికి నివేదించాం.
– శ్రీరాములు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి
పంచాయతీకి సన్నద్ధం


