నూతన ఎస్పీగా పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపతిరావ్
నాగర్‌కర్నూల్ క్రైం: నూతన ఎస్పీగా పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపతిరావ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపతిరావ్ 2015 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ సీఐడీ నుంచి బదిలీపై నాగర్‌కర్నూల్ ఎస్పీగా వస్తున్నారు. గతంలో ములుగు ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బదిలీపై వెళ్తున్నారు.
ఉత్తీర్ణత శాతం
పెంపునకు కృషిచేయాలి
కొల్లాపూర్ రూరల్: రానున్న పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు సమష్టిగా కృషిచేయాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కోర్టు వీధిలోని ప్రాథమిక పాఠశాల, గాంధీ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ, ఎల్లూరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అమరగిరి పాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గాంధీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన పరిశీలించి.. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించి.. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పిల్లలు చదువుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. పరీక్షలు సమయం సమీపిస్తున్న తరుణంలో ఉత్తీర్ణత శాతం మెరుగుపరుచుటకు ప్రత్యేక క్లాసులను నిర్వహించి విద్యార్థులలో ఏకాగ్రతను పెంచాలని కోరారు. అమరగిరిలో పాఠశాలకు కాంపౌండు నిర్మాణం చేయాలని గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా టెస్టు బుక్ మేనేజర్ నర్సింహులు, ఎంఈఓ ఇమ్మానుయల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మద్దిమడుగు హుండీ ఆదాయం రూ.26 లక్షలు
అమ్రాబాద్: పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించారు. మూడు నెలలకు సంబంధించి మొత్తం హుండీ ఆదాయం రూ.26,18,711తోపాటు మిశ్రమ వెండి 2.812 కిలోలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కించిన మొత్తాన్ని పదర గ్రామీణ వికాస్ బ్యాంకులో భద్రపరిచారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ మదన్‌కుమార్, ఈఓ రంగాచారి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాములునాయక్, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
నూతన ఎస్పీగా పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపతిరావ్


