మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
పెద్దకొత్తపల్లి/ పెంట్లవెల్లి: మహిళల ఆర్థిక అభివృద్ది కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లిలో ఇందిరమ్మ మహిళాశక్తి చీరలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు. మహిళ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు, మహిళలను యజమానులను చేయడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లను అప్పగించి అనేక కార్యక్రమాల ద్వారా వారిని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ క్యాంటీన్లు, మీసేవా కేంద్రాలు, బస్సుల కొనుగోలు కోసం రుణాలు, వరి ధాన్యం సేకరణ అప్పగించి మహిళలను ఆర్థికంగా నిలబెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ద్వారా రూ.8 వేల కోట్లు మిగిల్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే చేయూతతో మహిళలు ఆర్థికంగా రాణించాలన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని, ప్రధానంగా మహిళలు వ్యాపారాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే చీరలను మహిళలు గౌరవంగా భావించి ధరించాలన్నారు. వ్యాపార రంగాల్లో మహిళలు రాణించే విధంగా ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్‌డీఓ చిన్న ఓబులేష్, కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నాగేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ, మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, నాయకులు వెంకటేశ్వర్‌రావు, వెంకటేశ్వర్‌రెడ్డి, సత్యం, విష్ణు, శ్రీనివాసులు, గోపాల్‌రావు, శివకుమార్‌రావు, చంద్రయ్య, ఎల్లయ్య, కుర్మయ్య, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు


