డీసీసీ అధ్యక్షుడిగా వంశీకృష్ణ
● వరుసగా మూడోసారి నియామకమైన అచ్చంపేట ఎమ్మెల్యే
అచ్చంపేట: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వంశీకృష్ణ డీసీసీ అధ్యక్షుడిగా 2019 నుంచి వరుసగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. ఇప్పటికే తమిళనాడు ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షుడిగా వంశీకృష్ణ నియామకంపై రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను డీసీసీ అధ్యక్షుడిగా నియమించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంకగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


