
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
పెంట్లవెల్లి: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంగంపల్లితండాలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కలెక్టర్ బాదావత్‌సంతోష్‌తో కలిసి ఆయన శుంకుస్థాపన చేశారు. రూ.1.40 కోట్లతో పెంట్లవెల్లి నుంచి మంచాలకట్ట వరకు బీటీ రోడ్డు నిర్మాణం, ఎంగంపల్లితండాలో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించే అంగన్‌వాడీ సెంటర్‌కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. మేనిఫెస్టో సంబంధం లేకుండా భవిష్యత్‌లో ఇంకా మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పనులను కొనసాగిస్తామని పేర్కొన్నారు. అనంతరం రోడ్డు కాంట్రాక్టర్‌తో మాట్లాడుతూ వేగంగా, నాణ్యతగా రోడ్డు పనులు పూర్తి చేయాలని సూచించారు.
98 జీఓ నిర్వాసితులపై సీఎంతో చర్చిస్తా
పెంట్లవెల్లి మండలంలోని యంగంపల్లితండాలో 98 జీఓ నిర్వాసితులను మంత్రి కలిసి, తొందర్లోనే ఉద్యోగం లేదా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ సమస్యపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లంతా కలిసి సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తామని ఆయన నిర్వాసితులకు మాట ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయసింహ, ఎంపీడీఓ దేవేందర్, రామన్‌గౌడ్, వేణుగౌడ్, మండల అధ్యక్షుడు నర్సింహయాదవ్, నల్లపోతుల గోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ కబీర్, భీంరెడ్డి, గోపినాయక్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.