
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
అచ్చంపేట రూరల్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ పోలీసులకు సూచించారు. శుక్రవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల నియంత్రణకు సమష్టి కృషి చేయాలని ఎస్‌ఐ విజయభాస్కర్‌కు సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజు తదితరులు ఉన్నారు.