
అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
తిమ్మాజిపేట: మండలంలోని పలు గ్రామాల్లో చేపడుతున్న పనుల జాతర కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మండల ప్రత్యేకాధికారి, డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని ఆయన సూచించారు. గ్రామ సమీపంలో నిర్మించిన పశువుల షెడ్డును అధికారులతో కలిసి ప్రారంభించారు. మండలంలోని హనుమాన్‌తండాలో పశువుల కొట్టం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఏపీఓ సత్యనారాయణ, ఈసీ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామి అధికారులు పాల్గొన్నారు.