
భూ సమస్యలు పరిష్కరించాలి
చారకొండ: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వేగంగా పరిష్కరించాలని కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జనార్దన్‌రెడ్డి కల్వకుర్తి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా చారకొండకు విచ్చేసిన సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు. భూ భారతి రికార్డులను పరిశీలించారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, డిప్యూటీ తహసీల్దార్ విద్యాధరిరెడ్డి, సీనియర్ అస్టిస్టెంట్ శ్రీనునాయక్, ఆర్‌ఐలు భరత్, సుజాత, సిబ్బంది ఉన్నారు.
నిబంధనలు అతిక్రమించొద్దు
కోడేరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హౌజింగ్ జిల్లా అధికారి సంగప్ప హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి 72 ఇళ్లు మంజూరయ్యాయని, ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రావణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి రవితేజ, కారోబార్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
చెంచుల చెంతకు
ఓపెన్ యూనివర్సిటీ
కల్వకుర్తి టౌన్/బల్మూర్: విద్యకు నోచుకోని గ్రామీణ, చెంచు పెంటల్లో నివసిస్తున్న ఆదివాసీలు, చెంచులు, గోండులు తదితర జాతులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం రూ.500 లకు విద్య అందిస్తుందని ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ (ఎల్ ఎస్‌ఎస్‌బీ) వై.వెంకటేశ్వర్లు తెలిపారు. కల్వకుర్తి పట్టణంతో పాటు బల్మూర్ మండలంలోని కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ–143 స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం బిల్లకల్, చెంచుగూడెం, గ్రామాల్లో ఓపెన్ యూనివర్సిటీ విద్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచులకు విద్య లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి దొరకక పేదరికంలోనే మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన చెంచు జాతులతో పాటు ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్టైఫండ్ ఆధారిత, ఉచిత విద్య అందిస్తుందని తెలిపారు. 18 నుంచి 27 ఏళ్ల వయసు కలిగిన వారు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫ్రొఫెసర్ రవీంద్రనాథ్, ప్రిన్సిపాల్ పరంగి రవి, సాల్మన్, కల్వకుర్తి స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలు పరిష్కరించాలి

భూ సమస్యలు పరిష్కరించాలి