జన జీవనానికి ఇబ్బందులు రానివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

జన జీవనానికి ఇబ్బందులు రానివ్వొద్దు

Aug 21 2025 9:19 AM | Updated on Aug 21 2025 9:19 AM

జన జీవనానికి ఇబ్బందులు రానివ్వొద్దు

జన జీవనానికి ఇబ్బందులు రానివ్వొద్దు

నాగర్‌కర్నూల్‌: వర్షాల కారణంగా జన జీవనానికి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు. బుధవారం మండలంలోని చర్లతిర్మలాపూర్‌ రోడ్డుపై నిలిచిన వరద నీటిని అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ఉయ్యాలవాడ నుంచి చెర్లతిర్మలాపూర్‌ వెళ్లే రోడ్డుపైకి వరద నీరు చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు కలెక్టర్‌ దష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల జిల్లాలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎవరూ దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారిని రక్షించడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, శిథిలావస్థ ఇళ్లలో నివాసం ఉంటున్న వారి కోసం పునరావాసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వెంట పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారి విజయ్‌, నాగర్‌కర్నూల్‌ ఆర్డీఓ సురేష్‌బాబు తదితరులు ఉన్నారు.

అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు

కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చే యాలని కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌ అధికారులను ఆదేశించారు. వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్‌ దేవసహాయంతో కలిసి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ స్థానికులకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రోడ్లు, నీటి పారుదల, విద్యుత్‌, ఆరోగ్యం, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, సోలార్‌ విద్యుదీకరణ, మిషన్‌ భగీరథ వంటి రంగాల్లో పనుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో పీఆర్‌ ఈఈ విజయ్‌కుమార్‌, డీఈఓ రమేష్‌కుమార్‌, డీఆర్డీఏ చిన్న ఓబులేష్‌, కల్వకుర్తి ఆర్డీఓ జనార్ధన్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఈఈ సుధాకర్‌సింగ్‌, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ డీఈ, డైరీ, ఉపాధి కల్పన అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement