
భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు
వెల్దండ: మండల కేంద్రంతో పాటు కొట్ర, పెద్దాపూర్, కుప్పగండ్ల, తిమ్మినోనిపల్లి, బైరాపూర్ తదితర గ్రామాల్లో బుధవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించారు. మరికొందరు కోళ్లు, పొటేళ్లు కోసి అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు. కార్యక్రమంలో భూపతిరెడ్డి, చిందం కృష్ణయ్య, మట్ట వెంకటయ్యగౌడ్, నిరంజన్, విజేందర్‌రెడ్డి, ఎర్ర శ్రీను, తాటికొండ కృష్ణారెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆనంద్ తదితరులు ఉన్నారు.
వెల్దండలో బోనాలతోఊరేగింపుగా వస్తున్న మహిళలు