
చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం
వెల్దండ: కేఎల్‌ఐ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ సమీపంలో కోతకు గురైన కేఎల్‌ఐ డీ–82 కాల్వను సోమవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కోతకు గురైన డీ–82 కాల్వకు వేగంగా మరమ్మతు చేయించి.. ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఎవరైనా కావాలని ధ్వంసం చేస్తే సహించమన్నారు. కాల్వలో నీరు ప్రవహించే సమయంలో అధికారులు, పోలీసులు పర్యవేక్షించాల ని సూచించారు. ఎమ్మెల్యే వెంట కేఎల్‌ఐ ఎస్‌ఈ పార్థసారధి, ఈఈ శ్రీకాంత్, డీఈఈలు దేవన్న, బుచ్చిబాబు, ఏఈలు ప్రభాకర్, మాల్య, కాంగ్రెస్ నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, మోతీలాల్ నాయక్, భూపతిరెడ్డి, పర్వత్‌రెడ్డి, సంజీవ్‌కుమార్, వెంకటయ్యగౌ డ్, ఆనంద్‌కుమార్, రషీద్ ఉన్నారు.
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
నాగర్‌కర్నూల్: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 22 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. కా ర్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
పోలీసు ప్రజవాణికి 8 అర్జీలు..
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 8 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఫిర్యాదుదారుల సమస్యలను డీసీఆర్బీ డీఎస్పీ సత్యనారాయణ తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.
భక్తులకు
తాత్కాలిక ఏర్పాట్లు
అచ్చంపేట రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఉమామహేశ్వరం కొండపై నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో భక్తులకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. సోమవా రం ఆలయం వద్ద కొండపై నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని వారు పరిశీలించారు. ప్రస్తుతానికి నిత్యాన్నదానం నిలిపివేశామని.. వరద తాకిడి తగ్గాక యథావిధిగా కొనసాగుతుందన్నారు. అనంతరం ఘాట్‌రోడ్డును పరిశీలించా రు. భక్తులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
వచ్చేనెల 3న
సీఎం రేవంత్‌రెడ్డి రాక
అడ్డాకుల: వచ్చే నెల 3న మూసాపేటకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. మూసాపేట లో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా సోమవారం దేవరకద్రలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మూసాపేట గ్రామస్తులతో సమావేశమయ్యారు. మూసాపేటలో చివరి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. వచ్చేనెల ప్రారంభం నాటికి ఇళ్ల పనులను పూర్తి చేస్తే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం వాటిని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే గ్రామస్తులకు తెలిపారు.

చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం