
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కొల్లాపూర్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొల్లాపూర్‌లో ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ముందుగా వార్డుల వారీగా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అప్పులపాలుజేశారని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్‌రావు, నాయకులు నర్సింహారావు, మేకల రమ్య, శ్రీదేవిగౌతంగౌడ్, నాగరాజు, రహీంపాషా, ఖాదర్ పాషా, వేణుగోపాల్‌యాదవ్, డా.రాముడు పాల్గొన్నారు.