
అలుగు పారిన కేసరి సముద్రం
జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నీటితో నిండి అలుగులు పారుతున్నాయి. సోమవారం జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువుకు ఎగువన ఉన్న ఉయ్యాలవాడ, నల్లవెల్లి గ్రామాల నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో అలుగు పారింది. అదే విధంగా నాగనూలు, తిరుమలాపూర్ గ్రామాల్లోని చెరువుల అలుగులు రహదారులపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కొల్లాపూర్, వనపట్ల, గుడిపల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
– కందనూలు