
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపిక పోటీలు
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించగా.. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన 150 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా డీసీహెచ్ రమేశ్‌చంద్ర క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 30, 31 తేదీల్లో పాలమూరు యూనివర్సిటీలోని సింథటిక్ మైదానంలో నిర్వహించే 11వ రాష్ట్ర జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు, సంయుక్త కార్యదర్శి పరుశురాం, భిక్షపతి, నిర్మల, సుభాషిణి, బాలశ్రీ, జ్యోతి, బాలు, బాలయ్య, రాణా, రాజేందర్ పాల్గొన్నారు.