
ఘనంగా ఆంజనేయస్వామి పవిత్రోత్సవాలు
అమ్రాబాద్: పదర మండలంలోని మద్దిమడుగులో వెలిసిన పబ్బతీ ఆంజనేయస్వామి పవిత్రోత్సవాలు రెండో రోజు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకుడు వీరయ్య శర్మ బృందం వేదమంత్రాలతో స్వామివారికి గవ్యాంతర పూజ లు, వేదికార్చన, మండలార్చన, యాగశాలలో పట్టు పవిత్రముల ప్రతిష్ఠ, మూల మంత్రహోమా లు, పవిత్ర అధివాహనం, నంపాతహోమం, లఘు పూర్ణాహుతి తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్లో ఈఓ రంగాచారి, ఆలయ కమిటీ అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు.