
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, డీఈఓ రమేష్‌కుమార్, బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ప్రశాంతి మంగళవారం జిల్లాకేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంటిగదితోపాటు పాఠశాల పరిస రాలు అపరిశుభ్రంగా ఈగలు, దోమలు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో స్వయంగా మాట్లాడి వారికి అందిస్తున్న ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని రకా ల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా.. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై తీవ్ర అసంతృపి్‌త్ వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.