
వ్యాపారం చేస్తున్నారు..
ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. మేం ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, టై, బెల్టులు వి ద్యార్థులకు అవసరమైనవి విక్రయిస్తూ వ్యాపా రం చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
– బంగారుబాబు,
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
ఫిర్యాదు చేస్తే..
ప్రైవేట్ పాఠశాలల్లో నోటుబుక్స్, ఇతర సామగ్రి వంటివి విక్రయించరాదు. స్కూల్ నోటీసు బోర్డులో ఫీజుల వివరాలు తప్పనిసరిగా ఉండాలి. అధిక ఫీజులు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– రమేష్‌కుమార్, డీఈఓ
●

వ్యాపారం చేస్తున్నారు..