
మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి
అచ్చంపేట రూరల్: అచ్చంపేట మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు కోరారు. సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. గతంలో నల్లమల పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి రూ.100 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు అందించామని, మరోసారి సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు మున్సిపల్ చైర్మన్ వివరించారు. నిధులు మంజూరు కాగానే పట్టణంలో అవసరం ఉన్న చోట అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, సీసీరోడ్లతోపాటు వివిధ అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతున్నామని, భవిష్యత్‌లోనూ మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు
అమ్రాబాద్: బీఆర్‌ఎస్ నేత, పదర జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాంబాబునాయక్ సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాంబాబునాయక్‌తోపాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు నర్సింహ, వెంకటయ్య, రామ్మూర్తి తదితరులున్నారు.