
అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల ప్రతిభ
కందనూలు: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి సౌత్‌జోన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు, వెండి పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు సోమవారం తెలిపారు. సౌత్ జోన్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–18 బాలుర విభాగంలో ఉదయ్‌కిరణ్ హైజంప్ సిల్వర్ మెడల్, అండర్–20 బాలుర విభాగంలో కాట్రావత్ శ్రీను గోల్డ్ మెడల్, ఉమెన్ విభాగంలో కొడావత్ స్వప్న స్టీపుల్ చేజ్‌లో గోల్డ్ మెడల్, చైతన్య సిల్వర్ మెడల్, రాజేశ్వరి గోల్డ్ మెడల్ సాధించారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించడం పట్ల అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్‌యాదవ్, క్రీడాకారుల తల్లిదండ్రులు, మాజీ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.