
యోగా పోటీలలో విద్యార్థుల ప్రతిభ
కందనూలు: జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన యోగా పోటీలలో విద్యార్థులు వివిధ రకాల ఈవెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. వీరిని ఈ నెల చివరి వారంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాదం నరేందర్, యోగా గురువు శివానంద స్వామి, జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజర్స్ శివప్రసాద్, శంకర్ గౌడ్, శివకుమార్, సునంద, సాగర్, యాదగిరిరావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.