
పేదలకు అండగా మోదీ ప్రభుత్వం
తిమ్మాజిపేట: పేదల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలు అమలుచేస్తూ అండగా నిలుస్తున్నారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ అన్నారు. తిమ్మాజిపేట మండలం మరికల్‌లో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి కేంద్ర పథకాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పేదలకు ప్రతినెలా ఉచితంగా రేషన్ బియ్యం, రైతులకు పంట పెట్టుబడుల కోసం కిసాన్ సమ్మాన్‌నిధి, సబ్సిడీపై ఎరువులు, స్ప్రింక్లర్లు అందిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు చాలా వరకు కేంద్ర నిధులతోనే చేపడతున్నట్లు వివరించారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడంలో ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందన్నారు. ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.