బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం
కొల్లాపూర్: రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం కొల్లాపూర్‌లోని రాజాబంగ్లా ఎదుట ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా ట్టణంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజాబంగ్లా వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సంధర్భంగా బీసీ జనచైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు దాసరి అజయ్‌కుమార్ యాదవ్, బీసీ రిజర్వేషన్ల సాధన సమితి నాయకులు శివార్చక విజయ్‌కుమార్, పెబ్బేటి మల్లికార్జున్, శివశంకర్ యాదవ్, గాలియాదవ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగ రంగాల్లో తక్కువ జనాభా కలిగిన అగ్రవర్ణాలకు అధికంగా రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని.. బీసీలకు మాత్రం ఎలాంటి ఫలాలు అందడం లేదన్నారు. బీసీలు అన్నిరకాలుగా వంచనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి సర్కారు చేపట్టిన కులగణన ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక చట్టం చేయాలన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా బీసీలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు డా.పగిడాల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకుడు కట్టా శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, సాయిలు యా దవ్, రామస్వామి, విష్ణుమూర్తి, కాశన్న యాదవ్, బింగి సాయిలు, గాలెన్న, మేకల కృష్ణయ్య, ఆనంద్‌యాదవ్, చిలుక వెంకటస్వామిగౌడ్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


