సగరులకు ఆదర్శం భగీరథుడు
నాగర్‌కర్నూల్: సగరులకు భగీరథ మహర్షి ఆదర్శప్రాయుడని సగర సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. భగీరథ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ర్యాలీతోపాటు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ కూడలితోపాటు హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల్లో భగీరథ చిత్రపటాలు ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన భగీరథ జయంతి కార్యక్రమంలో సగర సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే సగర సంఘం జిల్లా కార్యాలయంలోనూ వేడుకలు నిర్వహించారు. సగర సంఘం కార్యాలయం నుంచి హౌసింగ్ బోర్డు మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీరాములు, జిల్లా గౌరవాధ్యక్షుడు అల్లం రాములు, రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మొల్లబాబు, బాలయ్య, సుధాకర్, శ్రీను, తిరుపతయ్య, బాబు, శైలు, పర్వతయ్య, వెంకటేష్, స్వామి, యుగంధర్, పాండు తదితరులు పాల్గొన్నారు.


