
చెంచుల స్థితిగతులపై అధ్యయనం
మన్ననూర్: నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసీ చెంచుల జీవన స్థితిగతులపై బుధవారం రాష్ట్ర అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేర కు అధికారుల బృందం అప్పాపూర్, భౌరాపూర్ చెంచు పెంటల్లో చెంచులతో సమావేశమై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. చెంచుల జోవనోపాదులతో పాటు జీవన భృతి తదితర అంశాల గురించి చర్చించారు. చెంచు పెంటల్లో తాగునీరు, రవాణా, రోడ్లు, చెక్‌డ్యాంలు తదితర సౌకర్యాల కల్పనతో పాటు నేచర్ గైడ్ల శిక్షణ కోసం రూ. 1.2కోట్లు మంజూరు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ జాయింట్ సెక్రెటరీ భవానీ శంకర్, పవన్‌సింగ్, ఫైనాన్స్ అధికారి శ్రీనివాస్, ట్రైబ ల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, ఇస్కాన్ సభ్యులు, మిష న్ భగీరథ డీఈ హేమలత, రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.