ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Mar 17 2025 10:50 AM | Updated on Mar 17 2025 10:45 AM

నాగర్‌కర్నూల్‌ రూరల్‌/తెలకపల్లి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ మండలం పెద్దాపూర్‌, తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. గట్టు నెల్లికుదురు గ్రామంలో రూ. 50లక్షలతో సీసీరోడ్డు, బస్టాండ్‌, డ్రెయినేజీ, కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతుభరోసా, రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కాగా, గట్టునెల్లికుదురులో బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ సర్పంచ్‌ బాల్‌రాం, మాజీ ఉపసర్పంచ్‌ తిరుపతయ్య, ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు సుందరయ్య, మాజీ వార్డు మెంబర్లు మధుసూదన్‌రెడ్డి, నాగమల్లయ్య, కాశన్న, తిరుపతయ్య తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, మండల ప్రత్యేకాధికారి రాంలాల్‌, హౌసింగ్‌ అధికారి హరినాయక్‌, ఎంపీడీఓ శ్రీనివాసులు, సింగిల్‌విండో వైస్‌చైర్మన్‌ మామిళ్లపల్లి యాదయ్య, వినోద్‌, శారద పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement