స్టేడియం ఊసేది..? | - | Sakshi
Sakshi News home page

స్టేడియం ఊసేది..?

Aug 22 2025 6:28 AM | Updated on Aug 22 2025 6:28 AM

స్టేడ

స్టేడియం ఊసేది..?

స్టేడియం విస్తరణ పనులు చేపట్టాలి కోచ్‌లకు గుర్తింపు ఇవ్వాలి

22 ఏళ్లుగా అసంపూర్తిగానే..

విస్తరణకు నోచుకోని ఎన్‌టీఆర్‌ స్టేడియం

ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి

ఎన్టీర్‌ మినీ స్టేడియం, ఇండోర్‌ స్టేడియం పనులు పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలి. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు పతకాలు సాధించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి క్రీడాభివృద్ధికి కృషి చేయాలి.

– ఎంఎన్‌గౌడ్‌,

ఏఆర్‌ఎం క్రికెట్‌ అకాడమీ హెడ్‌కోచ్‌

స్టేడియం కోసం వందలాది క్రీడాకారులు ఎదురుచూస్తున్నారు. తగిన సౌకర్యాలు కల్పించనప్పటికీ మా వంతుగా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాం. నాలాంటి ఎంతో మంది కోచ్‌లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. అందుబాటులో స్టేడియాలు లేక ఖాళీ స్థలాలు, మైదానాల్లో శిక్షణ పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కోచ్‌లను అభినందించలేదు. పతకాలు సాధించిన తర్వాత ప్రోత్సాహాకాలు అందిస్తున్నారు.

– ఎడ్మ శ్రీనుయాదవ్‌, మాస్టర్‌ అథ్లెటిక్‌ అసోషియేషన్‌ జిల్లా కార్యదర్శి

అచ్చంపేట: జిల్లాలో అత్యంత ప్రతిభావంతమైన క్రీడాకారులు ఉన్నా.. సాధన చేసేందుకు సరైన స్టేడియాలు, వసతులు లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు జిల్లాలో కొకోల్లలు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌లో ఇండోర్‌ స్టేడియాలు ఉన్నా నిర్వహణ లేక క్రీడాకారులకు అనుకూలంగా లేవు. కల్వకుర్తిలో ఫుట్‌బాల్‌ కోచ్‌ మినహా ఎక్కడ కూడా కోచ్‌లు లేరు. నాగర్‌కర్నూల్‌లో మల్టీపర్సస్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించాలనే డిమాండ్‌ ఉన్నా ఆచరణ సాధ్యం కావడం లేదు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ నైపుణ్యాలు ఉన్న క్రీడాకారులను వెలికితీస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనలు ఇస్తున్నా.. ఆయన పుట్టిన సొంత జిల్లాలో స్టేడియాల పరిస్థితి అద్వాన్నంగా ఉంది.

ండోర్‌ స్టేడియం నిర్మాణం కోసం 2003 డిసెంబర్‌ 8న అప్పటి ప్రభుత్వం రూ.60లక్షలు మంజూరు చేయగా.. అప్పటి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి పి.రాములుు శంఖుస్థాపన చేశారు. 2004లో ప్రభుత్వం మారడంతో రూ.10లక్షలు ఖర్చు చేసి చేపట్టిన పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. 2011 నవంబర్‌లో ఎమ్మెల్యే రాములు రూ.20లక్షలు కేటాయించి పనులు మొదలు పెట్టగా.. భవన నిర్మాణం, షెడ్డు పిల్లర్లు పనులు పూర్తి చేశారు. రూ.30లక్షలు ఖర్చు చేసినా స్టేడియం పనులు పూర్తి కాలేదు. 2013 జూన్‌లో స్పోర్ట్స్‌ అథారిటీ నుంచి మరో రూ.30లక్షల నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్‌ షెడ్డు నిర్మాణం పూర్తి చేసి వదిలేశారు. సింథటిక్‌ గ్రౌండ్‌, గ్యాలరీ, సైడ్‌ వాల్స్‌, ప్లాట్‌ఫాం, లైటింగ్‌, డ్రెసింగ్‌ రూం, ఆఫీసు రూం పనులు చేయాల్సి ఉంది. ఇండోర్‌ స్టేడియానికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో తర్వాత అధికారంలో వచ్చిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, గువ్వల బాలరాజు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2019లో రూ.2కోట్ల నిధులు మంజూరైన ఇంత వరకు పనులు మొదలు కాలేదు. అచ్చంపేట ప్రాంతంలో షటిల్‌ క్రీడాకారులున్నా.. కోర్టులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పబ్లిక్‌ క్లబ్‌, ఇతరులు ప్రతి ఏటా డివిజన్‌, జిల్లా స్థాయి షటిల్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. పబ్లిక్‌ క్లబ్‌, ప్రైవేట్‌ వ్యక్తులు వేరువేరుగా రెండు షటిల్‌ ఇండోర్‌ నిర్మాణాలు చేపట్టారు.

ఇండోర్‌ స్టేడియం విషయంలోనూ ఇదే పరిస్థితి

సౌకర్యాలు లేకున్నా జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు

రూ.10కోట్లు మంజూరైన

మొదలు కాని పనులు

నల్లమలలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గతంలో అచ్చంపేటలో ఎన్టీఆర్‌ మినీ స్టేడియం నిర్మించారు. ఆ తర్వాత ఇండోర్‌ స్టేడియం పనులు ప్రారంభించడంతో క్రీడాకారుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం ఉన్న స్టేడియంలో కొన్నేళ్లుగా ప్రతి ఏటా రెండు పర్యాయాలు జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా 2021లో స్టేడియం చుట్టూ ఉన్న ప్రహారీని కూల్చి కొంత దూరం పొడిగించారు. అక్కడక్కడ లైటింగ్‌ ఏర్పాటు చేసిన సౌకర్యాలు మరిచారు. 2018లో రూ.1.5కోట్లు, 2023లో రూ.6.50కోట్లు నిధులు మంజూరైన పనులు ప్రారంభించలేదు. దీంతో నిధులు వెనక్కి వెళ్లినట్లు సమాచారం. స్టేడియం విస్తరణ పనులు చేపట్టి రాజీవ్‌ఎన్టీఆర్‌ పేరుగా మారస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రకటించినా.. ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు.

స్టేడియం ఊసేది..? 1
1/3

స్టేడియం ఊసేది..?

స్టేడియం ఊసేది..? 2
2/3

స్టేడియం ఊసేది..?

స్టేడియం ఊసేది..? 3
3/3

స్టేడియం ఊసేది..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement