
ఉజ్వల భవిష్యత్..
పాలమూరులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఇక్కడ చేరిన విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఉజ్వల భవిష్యత్ లభిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు సాధ్యపడింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్‌లో ఇంజినీరింగ్ కళాశాలలు రావడంతో భవిష్యత్‌లో వేల సంఖ్యలో సీట్లు కేటాయించే అవకాశం ఉంది. తద్వారా కార్పొరేట్ కంపెనీలు జిల్లాకు వచ్చి.. ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. కళాశాలలో విద్యార్థులకు తరగతి గదులు మొదలు, హాస్టల్ ఇతర వసతులు కూడా కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
– యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్
●