
12 గంటలు దాటినా విధులకు రాలే..
● తహసీల్దార్‌పై ఎమ్మెల్యే అసహనం
● ఫోన్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు
లింగాల: విధులను విస్మరించే అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హెచ్చరించారు. ఎమ్మెల్యే గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనఖీ చేశారు. కార్యాలయంలో ఆయా విభాగాలను పరిశీలించిన ఎమ్మెల్యే తహసీల్దార్‌తో పాటు కింది స్థాయి సిబ్బంది విధులకు హాజ రు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయంలో సకాలంలో పనులు కాకపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని మండిపడ్డారు. మధ్యాహ్నం 12 గంటలయినా తహసీల్దా ర్ విధులకు రాకపోవడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. ధీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న వారిని స్థాన చలనం కల్పిస్తామన్నారు. కార్యాలయంలో ముడుపుల వ్యవహారం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆరోపించారు. అధికారుల పనితీరు గురించి కార్యాలయం నుంచే కలెక్టర్‌తో మాట్లాడారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. భూ భారతికి సంబంధించి మొత్తంలో 5,836 దరఖాస్తులు రాగా.. అధికారుల నిర్లక్ష్యం వల న వాటి పరిష్కారంలో జాప్యం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు
మండలంలోని అవుసలికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ తిరుపతిరెడ్డితో పాటు లింగాల, ఎంసీ, డీసీ తండాలకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాష్ట్ర నాయకుడు రంగినేని శ్రీనివాస్‌రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ, మాజీ ఎంపీటీసీ రాంబాబు పాల్గొన్నారు.