కొల్లాపూర్: ెహచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని ఎయిడ్స్ కంట్రోలింగ్ జిల్లా ఆఫీసర్ డా.రమేష్‌కుమార్ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విధ్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచ్చలవిడి లైంగిక వ్యవహారాల కారణంగా ఎయి డ్స్, హెచ్‌ఐవీ వ్యాప్తి చెందుతాయన్నారు. వాటివల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు. కౌమర దశలో యువత జాగ్రత్తగా మెలగాలని సూచించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎయిడ్స్ కంట్రోలింగ్ రిసోర్స్‌పర్సన్ సురేందర్, కళాశాల ప్రిన్పిపల్ ఉదయ్‌కుమార్, వైస్‌ప్రిన్సిపల్ వెంకటయ్య, నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోండి
కందనూలు: కేంద్ర కార్పొరేట్ వ్వవహారాల మంత్రిత్వశాఖ అందించే ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం రెండో దశ ప్రారంభమైందని జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు pminternship.mca.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 18001 16090 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రంలో విద్యుత్ లైన్ల మరమ్మతు నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ మాన్యనాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీపురం రోడ్డులోని హనుమాన్ దేవాలయం నుంచి రూబీ గార్డెన్స్ వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
వందశాతం
ఉత్తీర్ణత సాధించాలి
బిజినేపల్లి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని వట్టెం బాలుర ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పదో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం డీఈఓ మా ట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు అన్నివిధాలా సన్నద్ధం కావాలన్నా రు. విద్యార్థులతో ప్రణాళికాబద్ధంగా చదివించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని ఉపాధ్యాయుల కు సూచించారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అంతకుముందు పాఠశాలలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను డీఈఓ పరిశీలించా రు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పా టించాలని సూచించారు. అదే విధంగా వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు.
అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ