నాగర్‌కర్నూల్: దివ్యాంగులు, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఆయా నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో భాగంగా ఆదివారం వరకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 14 మంది వృద్ధులు, 19 మంది దివ్యాంగులు, అత్యవసర సేవలకు చెందిన 12 మంది, అచ్చంపేటలో 71 మంది వృద్ధులు, 51 మంది దివ్యాంగులు, అత్యవసర సేవలకు చెందిన 18 మంది, కొల్లాపూర్‌లో 26 మంది వృద్ధులు, 36 మంది దివ్యాంగులు, అత్యవసర సేవలకు చెందిన 62 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని కలెక్టర్ తెలియజేశారు. జిల్లాలో మొత్తం 300 మంది హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఆదివారం వరకు మొత్తం 247 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఎన్నికల విధుల్లో భాగంగా ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగంలో భాగంగా ఆదివారం వరకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గం పరిధిలో 836 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో 1,162 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 560 మంది ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. జిల్లాలోని ఎన్నికల సిబ్బంది రాష్ట్రంలోని ఇతర జిల్లా నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన ఎన్నికల సిబ్బంది 725 మంది ఉద్యోగస్తులు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోం ఓటింగ్ ప్రక్రియ నేటితో ముగిసిందని, ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈ నెల 28 వరకు వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్