‘పాలమూరు’ పనుల పరిశీలన

వట్టెం ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఎంపీ రంజీత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు  - Sakshi

భూత్పూర్‌/ బిజినేపల్లి: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే పరిగి, చేవేళ్ల, వికారాబాద్‌కు సాగునీరు వస్తుందని చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్‌ ఎమ్మెల్యే ఎం.ఆనంద్‌, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డితోపాటు 600 మందికిపైగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి 80కిపైగా కార్లలో నాగర్‌కర్నూల్‌ జిల్లా వట్టెం, మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలంలోని కర్వెన ప్రాజెక్టును పరిశీలించారు. జలాశయంలో నీటి నిల్వ, పంపింగ్‌ను ప్రత్యేకంగా తిలకించి పనితీరును ప్రాజెక్టు కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం, నీటి తరలింపు, సాగు విస్తీర్ణం, ప్రాజెక్టుతో రైతులకు కలిగే ప్రయోజనాలు ఎంపీ రంజిత్‌రెడ్డి వివరించారు. అనంతరం 15వ ప్యాకేజీలోని ప్రసాద్‌ ఇన్‌ఫ్రా కంపెనీలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టు సందర్శన, ప్రాజెక్టులో చేపట్టిన పనులను ఫొటోలను పరిశీలించారు. వీరి వెంట అడ్డాకుల జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి, ప్రసాద్‌ ఇన్‌ఫ్రా జీఎం రామరాజు, ప్రాజెక్టు అధికారులు విజయభాస్కర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రమేష్‌ ఉన్నారు.

ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యం

కందనూలు: ఆకలితో ఉన్న వారందరి ఆకలి తీర్చడమే సాయితత్వమని.. జిల్లా ఆస్పత్రిలో రోగులు, వారి వెంట వచ్చే సహాయకులకు ఐదేళ్లుగా భోజనం అందిస్తున్నామని సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు శంకరయ్య అన్నారు. ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభించి ఐదేళ్లు అయిన సందర్భంగా ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. నిత్యం 150 మందికిపైగా మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేస్తున్నామని, ఇకపై మరింత మందికి సాయి భక్తుల సహకారంతో అందజేస్తామన్నారు. సాయి ప్రశాంతి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు హకీమ్‌ మురళి, విశ్వ ప్రసాద్‌, భూదానం సుబ్బారావు, బాలకృష్ణ పాల్గొన్నారు.

Read latest Nagarkurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top