న్యూస్‌రీల్
ములుగు రూరల్: వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న సమయంలో రైతులకు యాంత్రీకరణ అవసరంగా మారింది. సాగు పనుల్లో కూలీల కొరతను అధిగమించి సమయం, పెట్టుబడి ఆదా చేసుకునేందుకు ప్రభుత్వం యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ రైతులకు వ్యవసాయ పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్‌మిషన్స్ అన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) పథకంలో భాగంగా వ్యవసాయశాఖ 37 రకాల వ్యవసాయ యంత్రాలు, పరికారాలను గుర్తించింది. వీటిని కస్టమ్ హైరింగ్ కేంద్రాలు (సీహెచ్‌సీ) ఏర్పాటు చేసుకునేందుకు రైతు, మహిళా సంఘాలు, ప్రాధమిక, వ్యవసాయ సహకార సంఘాలకు అవకాశం కల్పించింది.
యూనిట్ విలువ రూ.50లక్షలు
సంఘాలకు అందించే యూనిట్ విలువ రూ. 50లక్షలు ఉండగా అందులో 20 లక్షలు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. మిగితా రూ.30 లక్షలు సంఘం సభ్యులు బ్యాంక్ గ్యారంటీలతో యూనిట్‌లను పొందవచ్చు. అంతే కాకుండా సంఘాలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందించే పనిముట్లను అవసరం మేరకు తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. తీసుకున్న యూనిట్ విలువకు 40శాతం సబ్సిడీ అందనుంది.
సంఘాలకు మాత్రమే అర్హత
సబ్సిడీ అద్దె యంత్రాల పథకానికి మహిళా సంఘాలు, రైతు సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మాత్రమే అర్హత ఉన్నట్లు గుర్తించారు. రైతులకు అందుబాటులో ఉండి వ్యవసాయ పరికరాలను అందిస్తూ ఆర్ధికంగా సంఘాల బలోపేతమే లక్ష్యంగా పథకాన్ని అమలు చేస్తున్నారు. సంఘం ఏర్పడి మూడేళ్లు నిండినా సంఘాలు అన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.
జిల్లాలో యూనిట్ల వివరాలు
జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 12 యూనిట్లు మంజూరయ్యాయి. ములుగు మండలానికి 2 యూనిట్లు కేటాయించగా అందులో ఒకటి ఎస్సీ కేటగిరికి కేటాయించారు. మంగపేట మండలానికి 2 యూనిట్లు, వెంటకాపురం(కె) మండలానికి ఒకటి ఎస్టీ కేటగిరికి కేటాయించినట్లు వెల్లడించారు. మిగతా మండలాలకు మండలానికి ఒక యూనిట్ చొప్పున కేటాయించారు.
సీహెచ్‌సీల ద్వారా యంత్రాలను చిన్న, సన్నకారుల రైతులు సద్వినియోగం చేసుకోవాలి. యంత్రాల కొనుగోలు భారం లేకుండా సీహెచ్‌సీల ద్వారా అద్దె యంత్రాలను వినియోగించుకోవడం ఎంతో మేలు. దీంతో రైతులకు అద్దె ఖర్చులు తగ్గడంతో పాటు సంఘాలకు ఆర్ధిక భరోసా కలుగుతుంది. సంఘాల సభ్యులు అన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. – సురేశ్‌కుమార్,
జిల్లా వ్యవసాయ అధికారి
సీహెచ్‌సీల ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయానికి అవసరమయ్యే 37 రకాల యంత్రాలు, పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు. భూమి దుక్కి తయారీ నుంచి కోత వరకు అవసరమయ్యే పనిముట్లను అద్దె విధానంలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
● పవర్‌టిల్లర్ ● రోటవేటర్ ● కల్టివేటర్ ● డిస్క్‌ప్లవ్ ● సబ్ సాయిలర్ ● బండ్ ఫార్మర్ ● లెవలింగ్ బ్లెడ్‌లు ఉన్నాయి. విత్తన విభాగంలో ● సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ ● మల్లిక్రాప్ ప్లాంటర్ ● స్లాస్టిక్ మల్చింగ్ యంత్రం ● కలుపు తీయడంలో పవర్ వీడర్ ● బ్రష్‌కట్టర్ దీంతో పాటు ● కలుపుతీసే యంత్రం అందుబాటులో ఉంది. ● పంటలకు మందు పిచికారీకి పవర్ స్పేయర్ ● ట్రాక్టర్ బూమ్ స్ప్రేయర్ ● కిసాన్ డ్రోన్ ● కంబైండ్ హార్వెస్టర్ ● మొక్కజొన్న హార్వెస్టర్ ● మల్టిక్రాప్ థ్రెషర్ ● మైజ్ షిల్లర్ ● ధాన్యం ఆరబెట్టడానికి మొబైల్ డ్రయర్ వంటి తదితర పరికరాలు అందుబాటులో ఉండనున్నాయి.
37 రకాల పరికరాలు
అందుబాటులో 37 రకాల పరికరాలు
జిల్లాలో 12 యూనిట్లు మంజూరు
మహిళా, రైతు సంఘాలు, పీఏసీఎస్‌లకు అవకాశం
యూనిట్ విలువలో 40 శాతం సబ్సిడీ
చిన్న, సన్నకారు రైతులకు ఊరట


