నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Nov 20 2026 1:01 AM | Updated on Nov 20 2026 1:01 AM

ఏటూరునాగారం/వాజేడు: మారుమూల గ్రామాల్లో నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు రొయ్యూర్‌లో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు చేపట్టినట్లు టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి తెలిపారు. ఏటూరునాగారం మండల పరిధిలోని రొయ్యూర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పనులను ఆయన అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ సదానందం, ఏటూరునాగారం డీఈ పురుషోత్తం, ఏడీఏ ఉమారావు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వరుణ్‌రెడ్డిని రొయ్యూర్‌ సర్పంచ్‌ కావిరి అర్జున్‌ సన్మానించారు. పనులు మరింత వేగవంతం చేసి ప్రజలకు కరెంటు ఇవ్వాలని కోరారు. అలాగే వాజేడు మండల పరిధిలోని చీకుపల్లిలో సౌర విద్యుత్‌ ఉత్పత్తితో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌(బీఈఎస్‌ఎస్‌) ఏర్పాటు చేసినట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చీకుపల్లిలో ఏర్పాటు చేస్తున్న సొలార్‌ ప్లాంట్‌, బ్యాటరీల నిల్వ వ్యవస్థ పురోగతి పనులను ఆయన గురువారం పరిశీలించి మాట్లాడారు. విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 100 కిలో వాట్ల సామర్ధ్యంతో సోలార్‌ ప్లాంట్‌, 200 కిలో వాట్ల అవర్‌ సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పగటి పూట, సౌర విద్యుత్‌ ద్వారా గ్రామంలోని అవసరాలు తీర్చడం, అదనపు విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి రాత్రి వేళల్లో వినియోగించేలా రూపొందించినట్లు వివరించారు. ఈ నెల చివరి నాటికి సోలార్‌ ప్రాజెక్టు పనులు పూర్తి కానున్నాయని వివరించారు. ఏటూరునాగారం మండల పరిధిలోని రొయ్యూరులో నూతన సబ్‌ స్టేషన్‌ పనులను పరిశీలించారు. ఆయన వెంట జయశంకర్‌ భూపాలపల్లి ఎస్‌ఈ సదానందం, ములుగు డీఈ కన్నరాజు, ఏటూరునాగారం డీఈ పురుషోత్తం, కన్‌స్ట్రక్షన్‌ డీఈ నరసింహరావు తదితరులు ఉన్నారు.

టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ

కర్నాటి వరుణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement