ములుగు: మున్సిపాలిటీ పరిధిలో పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను వెంటనే తగ్గించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి అన్నారు. ఈ మేరకు పెంచిన పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ములుగు మండల మాజీ అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ సంపత్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా ప్రభుత్వ నిధులతో మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలన్నారు. పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సోమ నాయక్, వేములపల్లి భిక్షపతి, పోరిక విజయ్ రామ్ నాయక్, భూక్య జంపన్న, బైకాని సునీత, ఓదెలు, బైకాని సాగర్, గండ్రకోట వాణికుమార్, వేణు, లక్ష్మీ, భరత్, కోగిల మహేశ్, గొర్రె సమ్మయ్య, గరిగె రఘు, పైడిమల్ల భాస్కర్, సంతోష్, ముంజాల భిక్షపతి, రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి


