తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌ గని సందర్శన | - | Sakshi
Sakshi News home page

తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌ గని సందర్శన

Nov 20 2026 1:01 AM | Updated on Nov 20 2026 1:01 AM

మల్హర్‌: మండలంలోని తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌ గనిని ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ కమిటీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్‌ కంట్రోలర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులకు రేటింగ్‌ ఇచ్చేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తారు. 2025–26 సంవత్సరానికి గాను కమిటీ తాడిచర్ల గనిని గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్‌ బీఎన్‌ పండిట్‌ (ఓఎస్డీ, రీజినల్‌ హెడ్‌, సీసీఓ, ధన్‌బాద్‌), సభ్యులు పి.మోహన్‌రావు (జీఎం మైన్స్‌, టీజీజెన్‌కో), పి.శ్రీధర్‌ (నీట్‌ వరంగల్‌), రఘుకుమార్‌ (జీఎం సేప్టీ, సింగరేణి), ఎ.కృష్ణమోహన్‌రావు (ఓఎస్‌, సీసీఓ, కొత్తగూడెం రీజియన్‌) గనికి చేరుకున్నారు. గని యాజమాన్యం తరఫున ఏఎమ్మార్‌ ప్రాజెక్టు హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ కేఎస్‌ఎన్‌ మూర్తి, కమిటీ సభ్యులకు గని కార్యకలాపాలపై పూర్తి వివరాలు అందించారు. గని ఉత్పత్తి, సేఫ్టీ చర్యలు, పర్యావరణ పరిరక్షణ, అనుసరిస్తున్న సాంకేతికతలు, కార్మికుల సంక్షేమ చర్యలను కమిటీ పరిశీలించింది. పని చేసే ప్రాంతాలను స్వయంగా తనిఖీ చేశారు. కార్మికులకు ఇస్తున్న శిక్షణ, భద్రతా ప్రమాణాల అమలు, గనుల చట్టాల పాటింపుపై ఆరా తీశారు. కాగా, ఉత్తమ ప్రమాణాలు పాటించే గనులను ఎంపిక చేసి ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయని కమిటీ బాధ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement