న్యూస్‌రీల్
గురువారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2026
ఏటూరునాగారం: ఏజెన్సీ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగుతున్నారు. టైలరింగ్‌లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చిత్రామిశ్రా జిల్లాలోనే తొలి టైలరింగ్ హబ్‌ను ఏర్పాటు చేశారు. ఐటీడీఏ ద్వారా ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. టైలరింగ్ (కుట్టు) మిషనరీ కొనుగోలు చేసి ఐటీడీఏకు చెందిన స్థలంలోనే ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రాన్ని అధికారులు సిద్ధం చేశారు.
రూ.10లక్షలు.. 14 కుట్టు మిషన్లు
సెప్టెంబర్ 3వ తేదీన ఈ కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారికంగా ప్రారంభించారు. రూ.10లక్షల బడ్జెట్‌తో 14 కుట్టు మిషన్లను ఏర్పాటు చేసి వాటిని ఆదివాసీ జాయింట్ లయబులిటీ పేరుతో 10 మంది గిరిజన మహిళలకు అప్పగించారు. దీంతో మహిళలు ఐక్యంగా పనిచేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.
విద్యార్థులకు స్కూల్ యూనిఫాం
ఐటీడీఏ ద్వారా ఆదివాసీ గ్రూపు పేరుతో ఏర్పాటు చేసిన టైలరింగ్ హబ్‌లో ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలను కుట్టి ఇస్తున్నారు. ఇలా ఒక్కో స్కూల్ యూనిఫాంకు ధరలను నిర్ణయించారు. ఆశ్రమ పాఠశాలల్లోని బాలురు, బాలికలు అయితే ఒక్కో డ్రెస్‌కు రూ. 100లు, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లోని బాల బాలికలకు రూ.75ల చొప్పున ధర నిర్ణయించారు. యూనిఫాంలు కుట్టిన తర్వాత ఆయా స్కూళ్లకు అప్పగించిన తర్వాత వారికి నగదును స్కూల్ యాజమాన్యం అందిస్తుంది. ఇలా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని ఆశ్రమ పాఠశాలలు, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు.
2,496 మంది విద్యార్థులు..
ఏటూరునాగారం, కన్నాయిగూడెం పరిధిలోని ఆశ్రమ, గురుకుల పాఠశాలలతో పాటు కేజీబీవీలు మొత్తంగా 9 ఉన్నాయి. జూనియర్ కళాశాల ఒకటి ఉండగా వీటిలో మొత్తంగా 2,496 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లోని ఆశ్రమ పాఠశాలలకు మూడు యూనిఫామ్‌లు కేటాయించగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు వాటిని టైలరింగ్ హబ్‌లో మహిళలు తయారు చేస్తున్నారు.
ఐటీడీఏ ఆధ్వర్యంలో
ఉపాధి కేంద్రం ఏర్పాటు
మిషన్ల కొనుగోలుకు
రూ.10 లక్షల కేటాయింపు
ఉపాధి పొందుతున్న గిరిజన మహిళలు
విద్యార్థులకు యూనిఫాం కుట్టిస్తూ
ఆర్థికాభివృద్ధి
పాఠశాలలు సంఖ్య విద్యార్థులు
ఆశ్రమ పాఠశాలలు 05 1,220
గురుకులాలు 02 320
కేజీబీవీలు 02 546
జూనియర్ కాలేజ్ 01 410


