‘పట్టభద్రుల ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘పట్టభద్రుల ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి’

Nov 19 2026 12:55 AM | Updated on Nov 19 2026 12:55 AM

ములుగు: పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఓటరు జాబితాను పకడ్బందీగా గడువులోపు రూపొందించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్‌ కుమార్‌ దాస్‌ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు న్యూఢిల్లీ నుంచి ఆయన బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితాల నూతన రూపకల్పన ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌, వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితాల తయారీ ప్రక్రియలో పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో ఖమ్మం–వరంగల్‌–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు జాబితా నూతన రూపకల్పన ప్రక్రియను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ వీసీలో ఆర్డీఓ కృష్ణవేణి, డీటీ నితీశ్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement