జిల్లాల పనితీరు మెరుగుపడాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాల పనితీరు మెరుగుపడాలి

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

● వీసీలో సీఎస్‌ సంజయ్‌ జాజు

ములుగు: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్య, ఉపాధి హామీ, తాగునీరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధులను జనవరి మొదటి వారంలోగా పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. వీబీజీరామ్‌జీ ద్వారా మార్చి నెలాఖరులోగా 12 కోట్ల పని దినాల లక్ష్యాన్ని సాధించాలన్నారు. వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాకు ప్రాధాన్యతనిస్తూ నవంబర్‌ 15లోగా చేతిపంపులు, బోర్ల మరమ్మతు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు ఉచిత ఇసుక, రూ.230కే సిమెంట్‌ బస్తా అందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు. ములుగు ఐడీఓసీ నుంచి అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) సంపత్‌ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement