వెంకటాపురం(ఎం): గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సూచించారు. శుక్రవారం మండలంలోని చారిత్రాత్మక రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణగిరిపల్లెలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం రామాంజపురంలో రూ.1.35 కోట్లతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలను, రూ.1.50 కోట్లతో నిర్మించిన రామాంజపురం–వినాయక రైస్‌మిల్ పంచముఖాలయం రోడ్డును ప్రారంభించారు. అనంతరం వెంకటాపూర్ రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నారాయణగిరిపల్లె అభివృద్ధికి ఇప్పటివరకు దాదాపు రూ.1.50 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి పాలకవర్గాలు తీర్మాణాలతో ప్రతిపాదనలు పంపించాలన్నారు. మహిళా సంఘాల భవనాలు, పాఠశాలల ప్రహరీలు, యువతకు గ్రంథాలయాలు, చెరువుల కాల్వలు, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా సుమారు 4.50 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వెంకటాపూర్ మండలంలో మొత్తం 11,863 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, రామప్ప చైర్మన్ మిల్కురి ఐలయ్య, మండల పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, తహసీల్దార్ గిరిబాబు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి జీవనోపాధుల కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, బొల్లు దేవేందర్, నరిసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు త్వరలో కొత్త పింఛన్లు
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ధనసరి సీతక్క


