గోదావరి వరదపై సర్వే | - | Sakshi
Sakshi News home page

గోదావరి వరదపై సర్వే

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

ఏటూరునాగారం: రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నీటి నిల్వలు, వరద ప్రవాహంపై సర్వే చేపట్టారు. టెక్నీషియన్‌ రామ్‌చంద్ర, గోదావరి పుష్కరఘాట్‌ ఉద్యోగి బాబు కలిసి గోదావరి వరదను పరిశీలించారు. గోదావరి వరద ఇప్పటి వరకు ఎంతమేర వచ్చింది, ఎంత నిల్వ ఉందని మిషనరీ ద్వారా పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం గతంలో కంటే పెరిగినట్లు తెలిపారు. పుష్కరఘాట్‌ వద్ద వరద నీరు నిల్వ ఉండగా దాని లోతును పరిశీలించారు. సర్వే చేసిన నివేదికను జిల్లా అధికారులకు అందజేయనున్నట్లు సిబ్బంది తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సమయం కావడంతో ఇలాంటి సర్వేల ఆధారంగా ఘాట్‌ల నిర్మాణం, అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement