ధాన్యం నిల్వలపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం నిల్వలపై దృష్టి

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

ఏటూరునాగారం: జిల్లాలోని ధాన్యం నిల్వలపై అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని వ్యవసాయ శాఖ గోదాంను అధికారులతో కలిసి పరిశీలించారు. గోదాంలో ఎంత మేరకు నిల్వలున్నాయని, ఇంకా ఎన్ని వస్తాయని ఆరా తీశారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయ్‌ డీఎం కృష్ణవేణి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ జగదీశ్వర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వాజేడు: మండలంలోని చెరుకూరు వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర ధాన్యం చెక్‌పోస్టుతో పాటు తహసీల్దార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ కృపాకర్‌, ఆర్‌ఐ కుమారస్వామి ఉన్నారు.

గంజాయి మత్తులో యువకుల హల్‌చల్‌!

ములుగు: మండలంకేంద్రంలో గంజాయి మత్తులో యువకులు హల్‌చల్‌ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా మండలకేంద్రం శివారులోని రహదారిపై మాటు వేసి వచ్చిపోయే వాహనాలను నిలిపివేస్తూ కొంతమంది యువకులు పోలీసులమంటూ బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. గురువారం రాత్రి మండలకేంద్రంలోని రహదారిపై హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ అని చెప్పుకుంటూ ఇద్దరు యువకులు కంకరలోడుతో వెళ్తున్న టిప్పర్లను ఆపి అధిక లోడ్‌ వేసుకొని వెళ్తున్నారంటూ మామూలు ఇవ్వాలని బెదిరించినట్లు సమాచారం. దీంతో సదరు వాహనాల డ్రైవర్లు ఎంత బ్రతిమిలాడినా యువకులు వినకపోగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలో సదరు యువకులు వాహనాల ఓనర్లకు సైతం ఫోన్‌ చేసి డబ్బులు ఇస్తారా? లేదా? అని బెదిరించినట్లు సమాచారం. వాహనాల డ్రైవర్లు కొంత డబ్బును యువకులకు ముట్టజెప్పి వారి ద్విచక్ర వాహనం నంబర్‌ను నోట్‌ చేసుకొని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం పోలీసులు సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు లారీ క్లీనర్‌ సుమన్‌ ఫిర్యాదు మేరకు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు.

12న జిల్లా స్థాయి యువజనోత్సవాలు

ములుగు: యువతలోని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు నవంబర్‌ 12న జిల్లా స్థాయి వికసిత్‌ భారత్‌ యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎ.ధర్మ నాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బండారుపల్లి రోడ్డులోని గిరిజన భవన్‌లో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, జానపద నృత్యం, జానపద గీతాలు, చిత్రలేఖనం, వీధి నాటకం, కవిత్వ రచన అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువతీయువకులు అర్హులని, జిల్లా విజేతలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు మై భారత్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ ప్రింట్‌అవుట్‌, ఆధార్‌ ప్రతితోపాటు రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తీసుకురావాలన్నారు. వివరాలకు 9676534013 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement