ఆదివాసీల అభ్యున్నతికి పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల అభ్యున్నతికి పోరాడాలి

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

ఏటూరునాగారం: ఆదివాసీల అభ్యున్నతికి ఆదివాసీ, తుడుందెబ్బ సంఘాలు కలిసికట్టుగా పోరాడాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని ఆదివాసీ, తుడుందెబ్బ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు సంపూర్ణంగా అమలు కావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కల్తి ఎల్లయ్య, వట్టం సుభద్ర, లక్ష్మణ్‌రావు, పాయం కోటి, పూనెం చంటి, కొప్పుల జగన్‌, తురుసం చంటి, మట్టి కృష్ణ, పులిశె బాలకృష్ణ తదిరతులు పాల్గొన్నారు.

తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు

మైపతి అరుణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement